కాకినాడలో కామాంధులు.. మహిళను రేప్ చేసి వీడియోలతో బెదిరింపులు
జిల్లా కాకినాడలో కామాంధులు రెచ్చిపోయారు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళపై కన్నేసిన యువకుడు ఆమెను మాయమాటలతో లొంగదీసుకుని అత్యాచారం చేయడమే కాకుండా.. ఆ తతంగాన్ని వీడియో తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాము కోరినప్పుడల్లా కోరిక తీర్చకపోతే ఆ వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామంటూ వేధించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. Also Read: సర్పవరం ప్రాంతానికి చెందిన మహిళ మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఆమెకు కొద్దినెలల క్రితం రఘు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆమెకు అవసరమైన పనులు చేస్తూ రఘు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ 27న తన ఇంటికి ఆహ్వానించి మాయమాటలతో ఆమెను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారం చేసి సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. Also Read: తాను చెప్పినట్లు వినకపోతే ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. ఇలా ఆ వీడియోను అడ్డం పెట్టుకుని ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సాయికిరణ్ అనే యువకుడు కూడా కొంతకాలంగా వేధిస్తున్నాడు. తన కోరిక తీర్చకపోతే ఈ వీడియో సంగతి బయటపెడతానని బెదిరించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రఘు, సాయికిరణ్‌తో పాటు మరో యువకుడిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 15, 2020 at 09:55AM
No comments