నేనే బీజేపీలో చేరడంలేదు.. ఇప్పటికీ కాంగ్రెస్ సభ్యుడినే: సచిన్ పైలట్
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్‌తో విభేదించిన తిరుగుబావుటా ఎగురవేసిన సచిన్ పైలట్‌పై వేటు వేసిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి ఆయన్ను తొలగించారు. అయితే, పైలట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకుంది. బీజేపీలోకి వెళతారా? సొంత కుంపటి పెట్టుకుంటారా? అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. పైలట్ స్పందించారు. తాను బీజేపీలో చేరడంలేదని, ఇప్పటికా కాంగ్రెస్ సభ్యుడనేని బుధవారం వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి తాను ఎంతగానో శ్రమించానని అన్నారు. తాను బీజేపీలో చేరుతానని కొందరు నేతలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని, అయితే ఆ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఆయన బుధవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించవచ్చని తెలుస్తోంది. సీఎల్పీ సమావేశానికి హాజరుకాని సహా మరో 18 మందికి నోటీసులు జారీచేశామని, దీనికి రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉందని రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ అవినాశ్ పాండే అన్నారు. రెండు రోజుల సమయంలో వారు సమాధానం ఇవ్వకపోతే సీఎల్పీ సభ్యత్వం నుంచి తప్పుకున్నట్టే భావిస్తామని అన్నారు. జైపూర్‌లో జరిగిన సీఎల్పీ భేటీకి వరుసగా రెండో రోజూ సచిన్ పైలట్ గైర్హాజరయ్యారు. దీంతో ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. సచిన్ పైలట్‌ను రాజస్థాన్ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా ప్రకటించారు. సచిన్ పైలట్ స్థానంలో గోవింద్ సింగ్ దోత్సారాను రాజస్థాన్ పీసీసీ చీఫ్‌గా నియమించినట్లు ఆయన రణదీప్ తెలిపారు. ముఖ్యమంత్రి నివాసంలో సోమవారం కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశాన్ని నిర్వహించగా.. మొత్తం 107 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రెండు గంటల పాటు కొనసాగింది. సీఎల్పీలో ముగిసిన అనంతరం ఎమ్మెల్యేలను బస్సుల్లో హోటల్‌కు తరలించారు. ముందు నుంచి గెహ్లాట్, సచిన్ పైలట్ ఎడ మొహం పెడ మొహంగానే ఉంటున్నారు. 2013లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని ముందుండి నడిపిన పైలట్.. 2018 ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి, విజయానికి కారకులయ్యారు. అధికార పగ్గాలు ఆయనకే దక్కుతాయని భావించినా, సీనియర్‌కు అవకాశం ఇవ్వడంతో మిన్నుండుకుపోయారు. పోనీ మంత్రివర్గంలోనైనా ప్రాధాన్యత దక్కుతుందనుకుంటే అందులోనూ నిరాశ మిగిలింది. మంత్రివర్గ విస్తరణలో అసంతృప్తి మిగిలింది. కీలకమైన హోం, ఫైనాన్స్ శాఖలు గహ్లోత్ వర్గానికి వెళ్లాయి. ఈ విషయంలో ఇరు వర్గాలను రాజీచేయడానికి స్వయంగా రాహుల్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
By July 15, 2020 at 10:18AM
No comments