Breaking News

టోటల్‌గా దానికే అడిక్ట్ అయ్యా.. ఈ లాక్‌డౌన్ సమయమంతా అదే పని: వరలక్ష్మి శరత్ కుమార్


కరోనా కారణంగా గత మూడు నెలలుగా దేశమంతా ఎక్కడికక్కడే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. పరిశ్రమలు, సినిమా షూటింగ్స్, పబ్లిక్ పార్కులు, థియేటర్స్, పర్యాటకం, రవాణా వ్యవస్థ అన్నీ మూతపడటంతో అందరూ ఇంట్లోనే ఉంటూ ఎవరికి తోచిన విధంగా వారు టైం పాస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బ్యూటిఫుల్ హీరోయిన్ .. తన టైం పాస్‌ ఏంటనే విషయాన్ని తెలుపుతూ తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. ఈ ఖాళీ సమయంలో తాను టీవీ వీడియో గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నానని, టోటల్‌గా దానికే అడిక్ట్ అయిపోయా అని పేర్కొంటూ ఇదే ఈ లాక్‌డౌన్ టైం పాస్ అని తెలిపింది. ఈ మేరకు వీడియో గేమ్ ఆడుతున్న వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. Also Read: ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్.. తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘’ చిత్రంలో, అలాగే అల్లరి నరేశ్ 'నాంది' సినిమాలో భాగం అవుతోంది. ఈ రెండు సినిమాల్లో ఆమె పోషిస్తున్న క్యారెక్టర్స్ దేనికవే ప్రత్యేకం అని తెలుస్తుండటంతో వెండితెరపై వరలక్ష్మి పర్‌ఫార్‌మెన్స్ చూడాలని ప్రేక్షకులు కుతూహలంగా ఉన్నారు.


By July 02, 2020 at 11:32AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/varalaxmi-sarathkumar-says-about-her-addiction-in-this-lockdown-period/articleshow/76743913.cms

No comments