Breaking News

14ఏళ్ల వయసులోనే ఇద్దరిపై బాలుడి అఘాయిత్యం.. షాకైన గ్రామస్థులు


ఇద్దరు బాలికలపై ఓ బాలుడు అత్యాచారానికి యత్నించిన ఘటన జిల్లా పూసపాటిరేగ మండలంలోని ఓ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఆదివారం జరిగిన ఈ ఘటనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో ఆదివారం ఇద్దరు బాలికలు(7, 8 ఏళ్లు) బయటికొచ్చి ఆడుకుంటున్నారు. వారిని గమనించిన అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు వారికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. Also Read: అక్కడ వారిద్దరిపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో భయపడిన పోయిన బాలికలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. ఏం జరిగిందని చిన్నారులను అడగ్గా అసలు విషయం చెప్పారు. దీంతో గ్రామస్థులు ఆ బాలుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు బాలుడిని విచారించగా నేరం అంగీకరించాడు. పూసపాటిరేగ ఎస్ఐ బాలాజీరావు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు, అత్యాచారయత్నం, డిజిబిలిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By July 08, 2020 at 09:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/14-yr-old-boy-rape-attempt-on-two-girls-in-vizianagaram-district/articleshow/76845985.cms

No comments