Breaking News

Anchor Ravi: యాంకర్ రవి హీరోగా ‘అప్పట్లో దుప్పట్లో.. ట్రెడ్డింగే రన్నింగ్!!


‘వీళ్లు టీవీల్లో కనపడితే ఎంటర్‌టైన్మెంట్‌కే ఎనర్జీ వస్తది. వీళ్లు నవ్వించడం మొదలెడితే ట్రెండింగే రన్నింగ్‌లో ఉంటది. అందర్నీ కలిపింది ఈ . ఇక అభిమానులకు నవ్వుల పండుగ మొదలైంది’ అంటూ హడావిడి మొదలుపెట్టేశారు ‘అదిరింది’ బ్యాచ్. జబర్దస్త్ కామెడీ షోకి పోటీగా జీ తెలుగులో ప్రసారం అయిన ‘అదిరింది’ కొన్ని ఎపిసోడ్‌ల తరువాత కరోనాతో బ్రేక్ పడింది. జడ్జీగా ఉన్న ఈ కామెడీ షోలో చమ్మక్ చంద్ర, వేణు, ధనరాజ్, కిర్రాక్ ఆర్పీ, సద్దాం పంచ్‌లు పేల్చేందుకు ఈవారం సిద్ధం అయ్యారు. ఆదివారం నాడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. యాంకర్ రవి, భాను శ్రీలు ‘అదిరింది’ షో మెంటర్స్‌గా ఉన్నారు. తాజాగా ఎపిసోడ్‌లో చమ్మక్ చంద్ర ఎప్పటిలాగే భార్య బాధితుడుగా గిన్నెలు కడుగుతూ కనిపించి తన బాధలను చెప్పుకుని పాత కామెడీనే గిర్రున తిప్పాడు. ఇక వేణు.. తన టీంతో కలిసి ‘నవదీప్ ఆఫీస్’ స్కిట్ చేయగా.. ఆ ఆఫీస్‌కి వెళ్తే ఏం జరుగుతుందో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు వాడుతూ.. జడ్జీ నవదీప్‌ను బాగానే వాడేసుకున్నాడు. ఇక కిర్రాక్ ఆర్పీ కూడా భార్య బాధితుడుగానే కనిపించి.. పెళ్లం చేతిలో తన్నులు తిన్నాడు. ఇక యాదమరాజు స్కిట్‌లో యాంకర్ రవిని బాగా వాడేశారు కమెడియన్స్. ‘మన నాటీ స్టార్ రవితో మూడు సినిమాలు తీశా.. టైటిల్ ఏంటో తెలుసా.. ‘అప్పట్లో దుప్పట్లో’ అంటూ రవికి తగ్గ టైటిల్ ఇచ్చారు. ఇక నీలాంటోడే గదిలో శోభనం ఘనంగా చేసుకోవాలంటే.. రూంలో రవన్నను యాంకర్‌గా పెట్టుకున్నాడట’ లాంటి పంచ్‌లు బాగా పేలాయి. ఇక సద్దాం గలీజ్ గల్లీ బాయ్స్‌ స్కిట్‌తో మరోసారి ఇరగదీశారు.. గల్లీ క్రికెట్‌లో ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎంట్రీ అరిపించింది. ఓవరాల్‌గా ఈ ప్రోమోలో రవి హీరోగా ‘అప్పట్లో దుప్పట్లో’ అనే టైటిల్‌తో పాటు.. అతనిపై వేసిన పంచ్‌లు బాగా పేలాయి. ఈ ప్రోమోను బట్టి ఈవారం ‘అదిరింది’ అదరగొట్టేట్టుగానే ఉంది. Video Courtesy Zee Telugu


By July 03, 2020 at 12:32PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/zee-telugu-adhirindi-comeback-promo-saddam-hussein-gully-boyz-team-hilarious-comedy-with-anchor-ravi/articleshow/76765827.cms

No comments