Breaking News

శ్రావణి మిస్సింగ్ కేసు.... 9 నెలల తర్వాత పుర్రె, ఎముకలు లభ్యం


జిల్లా కదిరిలో గతేడాది అక్టోబర్‌లో అదృశ్యమైన డిగ్రీ విద్యార్థిని శ్రావణి అస్థిపంజరంగా కనిపించడం కలకలం రేపుతోంది. ఈ నెల 22న స్థానిక మున్సిపల్‌ పరిధిలోని సోమేష్‌ నగర్‌ సమీపంలో శ్రావణికి ఐడీ కార్డు, పర్సును గొర్రెల కాపరి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో డీఎస్పీ షేక్‌ లాల్‌ మహమ్మద్, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీక్ సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిశీలించారు. పంట పొలాల్లో పడి ఉన్న పర్సులో శ్రావణి ఐడీ కార్డు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు, నగదు లభ్యమయ్యాయి. కాస్త దూరంలో ఓ పుర్రె, ఎముకలు కనిపించాయి. అయితే అవి శ్రావణివేనా? లేక వేరేవాళ్లవా? అన్నది తేలాల్సి ఉంది. నిర్ధారణ కోసం ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read: మండలంలోని ఓ గ్రామానికి చెందిన శ్రావణి ఓ ప్రైవేట్‌ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలోనే 2019, అక్టోబర్‌ నెలలో ఓ రోజు కాలేజీకి వెళ్లిన ఆమె ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబసభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆఛూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. Also Read: వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీనిపై కుటుంబసభ్యులు పలు చోట్ల గాలించి, చివరకు కదిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెలలు గడుస్తున్నా ఈ కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. తాజాగా లభ్యమైన ఎముకల అవశేషాలతో ఈ కేసు మలుపు తీసుకుంది. అయితే శ్రావణిని దుండగులు అపహరించి అత్యాచారం చేసి చంపేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Also Read:


By July 24, 2020 at 10:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kadiri-police-reveals-degree-student-sravani-missing-case-found-skeleton/articleshow/77140354.cms

No comments