కాలేజీ రోజుల్లో ప్రేమ లేఖలు.. అతగాడిచ్చిన ఆ లవ్ లెటర్..!! సీక్రెట్స్ బయటపెట్టిన కీర్తి సురేష్
తక్కువ సినిమాలే చేసినప్పటికీ లీవుడ్ టాప్ హీరోయిన్ లెవల్ క్రేజ్ కొట్టేసింది యంగ్ హీరోయిన్ కీర్తిసురేష్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ సినిమా ఆమెను అందలమెక్కించింది. ఆ సినిమాతో కీర్తిలో దాగి ఉన్న అనంత నటనా ప్రతిభ అటు దర్శకనిర్మాతలకు, ఇటు ప్రేక్షకలోకానికి తెలిసిపోయింది. దీంతో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కాలేజీ రోజుల్లో ప్రేమ సంగతులు, లైఫ్ సీక్రెట్స్ వెల్లడించి అట్రాక్ట్ చేసింది. కాలేజీ రోజుల్లో మీ ప్రేమ సంగతులు చెప్పండి.. మీకు ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి అని యాంకర్ అడిగిన ప్రశ్నపై ఓపెన్‌గా సమాధానం చెప్పింది . కాలేజీ రోజుల్లో తనకు ప్రేమ లేఖ ఒక్కటి కూడా రాలేదని చెప్పిన ఆమె.. ఓ అభిమాని ఇచ్చిన సంఘటన గురించి మాత్రం చెప్పింది. ఓ సారి తాను జ్యూయెలరీ షాప్ ఓపెనింగ్‌కు వెళ్లగా.. ఓ అభిమాని బహుమతి ఇచ్చాడని, అది తెరచి చూస్తే తన ఫొటోలతో కూడిన ఆల్బమ్‌తో పాటు.. తనకు ప్రపోజ్ చేస్తూ ఓ లవ్ లెటర్ అందులో ఉంచాడని చెప్పింది. అయితే దాన్ని ఇప్పటికీ భద్రం దాచుకున్నా అంటూ సీక్రెట్ బయటపెట్టేసింది కీర్తి సురేష్. Also Read: ఇకపోతే ఇటీవలే 'పెంగ్విన్' మూవీతో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిన కీర్తి సురేష్.. ప్రస్తుతం 'గుడ్ లక్ సఖి', '' సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు అతిత్వరలో విడుదల కానున్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న 'రంగ్ దే' సినిమాలో అను పాత్రలో కనిపించనుంది కీర్తి.
By July 24, 2020 at 10:46AM
No comments