రూ.వెయ్యి అప్పు తీర్చలేదని మహిళపై అత్యాచారం.. కామాంధుడికి 34ఏళ్ల జైలుశిక్ష
మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి తమిళనాడులోని న్యాయస్థానం 34ఏళ్ల జైలుశిక్ష విధించింది. నామక్కల్ జిల్లాకు చెందిన ఓ మహిళ 2010 ఏప్రిల్ 4న శివకుమార్ అనే వ్యక్తి వద్ద రూ.1000 అప్పు తీసుకుంది. చెప్పిన సమయానికి ఆమె అప్పు తీర్చకపోవడంతో శివకుమార్ ఆమెను వేధించేవాడు. ఆమె పరిస్థితిని ఆసరాగా తీసుకుని సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని, నిర్మాత రమ్మంటున్నాడని నమ్మించి ఆమెను తన దుకాణానికి రప్పించాడు. Also Read: అక్కడ శివకుమార్ ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడగా.. రవి ఆ దారుణాన్ని సెల్‌ఫోన్లో వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో బాధితురాలు నిందితులుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో రవి చనిపోయాడు. ఈ కేసుకు సంబంధించి గురువారం తుది విచారణ చేపట్టిన న్యాయస్థానం శివకుమార్‌కు రూ.34ఏళ్ల జైలుశిక్ష, 13వేల జరిమానా విధించింది. దీంతో పాటు బాధితురాలికి రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. Also Read:
By July 24, 2020 at 11:10AM
No comments