హిజ్రాను పెళ్లి చేసుకుని రూ.20లక్షలతో ఉడాయింపు.. ఆర్మీ జవాన్‌పై కేసు
హిజ్రాను పెళ్లి చేసుకుని మోసం చేసిన ఆర్మీ జవాన్ చిక్కుల్లో పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కర్నూలు జిల్లా పోలీసులు సైనికోద్యోగి మాలిక్ బాషాపై శనివారం కేసు నమోదు చేశారు. నంద్యాల మండలంలోని అబాండం తండాకు చెందిన స్వప్న అనే హిజ్రాను మాలిక్ బాషా కొన్నాళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్వగ్రామంలో ఇల్లు కడుతున్నానని చెప్పి ఆమె నుంచి విడతల వారీగా సుమారు రూ.20లక్షల వరకు తీసుకున్నాడు. Also Read: కొంతకాలం తర్వాత ఆమె నుంచి తప్పించుకుని వేరొక యువతిని పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం చేస్తున్నాడు. తన భర్త కోసం గాలించిన హిజ్రాకు మాలిక్ బండారం గురించి తెలిసింది. అయితే రెండో భార్యను కూడా అతడు మోసం చేసినట్లు తెలుసుకుని నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ఎందుకు మోసం చేశావని నిలదీస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 12, 2020 at 08:03AM
No comments