Breaking News

దేశంలో ఉద్ధృతంగా కరోనా.. ప్రపంచం మొత్తం కేసుల్లో భారత్ వాటా 12 శాతం!


దేశంలో కేసుల సంఖ్య 8.5 లక్షలు దాటేసింది. కేవలం రెండు రోజుల్లోనే పాజిటివ్ కేసులు ఎనిమిది లక్షల నుంచి ఎనిమిదిన్నర లక్షలకు చేరుకోవడం దేశంలో తీవ్రతకు అద్దం పడుతోంది. శనివారం దేశవ్యాప్తంగా దాదాపు 29,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజుల నుంచి రికార్డుస్థాయిలో కేసులు నమోదుకావడం గమనార్హం. శనివారం మరో 540 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మరణాల్లో శుక్రవారం నాటి రికార్డును అధిగమించింది. జూన్ 16న అత్యధికంగా 2,003 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా గత వారం రోజుల నుంచి నమోదవుతున్న కేసుల్లో భారత్ వాటా 12 శాతంగా ఉంది. శుక్రవారం ప్రపంచంలో నమోదయిన కేసుల్లో భారత్ వాటా 11.8 శాతంగా నమోదయ్యింది. శుక్రవారం రికార్డుస్థాయిలో ఒక్క రోజు 2.37 లక్షల కేసులు నమోదయినట్టు వరల్డ్‌మీటర్స్ తెలిపింది. ప్రపంచంలోని పాజిటివ్ కేసుల్లో జూన్ చివరి వారం నుంచి భారత్ వాటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయినప్పటికీ ప్రపంచ జనాభా ప్రకారం భారత్ వాటా తక్కువగానే ఉంది. ఏదేమైనా, గత ఐదు వారాల్లో వారపు సంఖ్యతో (మూడు రోజుల సగటు) పోల్చితే జూన్ 10 న భారీగా పెరుగుదల నమోదయ్యింది. జూన్ 3తో పోలిస్తే భారత్ వాటా 1.3 శాతం పాయింట్లు పెరిగి, 10.5%కి చేరింది. మరో మాటలో చెప్పాలంటే, గ్లోబల్ కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నప్పుడు, భారత్‌లో వృద్ధి రేటు అంతర్జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. ఇక, శనివారం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 28,998 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 8,50,052కి చేరుకోగా.. మరణాల సంఖ్య 22,664కి చేరింది.


By July 12, 2020 at 07:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-indias-share-in-daily-global-positive-cases-now-12/articleshow/76917327.cms

No comments