Breaking News

గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌ల్లోకి భారత్ పులుల గణన నివేదిక 2018


దేశంలో పులుల సంతతి గణనీయంగా పెరుగుతోంది. పులుల సంఖ్య 2018 లెక్కల్లో గిన్నీస్ ప్రపంచ రికార్డు నమోదయ్యింది. దేశంలో పులుల సంఖ్య వేగంగా పెరగడంతోపాటు 76,000 పులులు, 51వేల అడవి పిల్లులు, చిరుతపులుల ఫోటోల సంగ్రహణలో భారత్ ప్రపంచ రికార్డును సృష్టించింది. పులుల ఫోటోలను తీయడనికి, అటవీ అధికారులు, సంరక్షణ నిపుణులు 139 స్టడీ సైట్లలో 26,760 వేర్వేరు ప్రదేశాలలో కెమెరాలను ఉంచారు. ఈ ప్రాంతాల్లో తీసిన మొత్తం 35 మిలియన్ ఫోటోలను పరిశీలించిన తర్వాత పులుల సంఖ్యపై నిర్ధారణకు వచ్చారు. విస్తృతమైన వన్యప్రాణుల అరుదైన ఛాయాచిత్రాలను తీయడంతో పాటు 76,523 పులుల చిత్రాలు, 51,337 చిరుతపులుల ఫోటోలను కూడా సంగ్రహించాయి. భారత్‌లో 2018 పులుల జనాభా లెక్కల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం దాదాపు 3000 పులులు ఉన్నాయి. చివరిసారిగా 2014లో జరిగిన లెక్కింపు కంటే చాలా పెద్ద సంఖ్యలో పెలులు పెరిగాయి. ప్రకృతి ప్రేమికుల సంతోషం కోసం తాజా వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం 2014లో 2,226గా ఉన్న పులుల సంఖ్య 2018కి 2,967కి చేరింది. భారత్ ప్రపంచంలోని అడవి పిల్లులకు అతిపెద్ద, అత్యంత సురక్షితమైన ఆవాసాలలో ఒకటిగా నిలిచింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ), జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ) కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం 2006లో దేశంలో 1,411 పులులు మాత్రమే ఉండగా, వాటి సంఖ్య 2014కు 2,226కు, 2018కి 2,967కు పెరిగింది. పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించారు. మోదీ మాట్లాడుతూ ‘పులుల సంఖ్యను పెంచడంపై 9 ఏళ్ల క్రితం రష్యాలోని సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ స్థాయి సమావేశం జరిగింది.


By July 11, 2020 at 11:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indias-2018-tiger-census-sets-a-new-guiness-world-record/articleshow/76905436.cms

No comments