కరోనా బారిన బాలీవుడ్ దిగ్గజం అమితాబ్, అభిషేక్..!
కరోనా మహమ్మారి రోజు రోజుకీ దాని విస్తృతిని పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 8.5లక్షలకి పైగా కేసులు నమోదయ్యాయి. అందులో ఎక్కువభాగం కేసులు మహారాష్ట్రలోనివే కావడం గమనార్హం. ముఖ్యంగా ముంబయిలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ దిగ్గజమైన అమితాన్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనాబారిన పడ్డారు.
ఈ మేరకు అమితాబ్ బచ్చన్ స్వయంగా ట్వీట్ చేసారు. తాను కరోనా బారిన పడ్డానని, తన ఇంట్లో వాళ్లకి టెస్టులు జరిగాయని, తనతో పది రోజుల నుండి క్లోజ్ గా ఉన్నవాళ్ళు కూడా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. దీంతో బిగ్ బీ అభిమానుల్లో ఆందోళన చోటు చేసుకుంది. ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. తండ్రీ కొడుకులు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని యావత్ సినీ ప్రపంచం, ఇంకా ప్రతీ ఒక్క అభిమాని కోరుకుంటున్నారు.
By July 12, 2020 at 05:52PM
No comments