Breaking News

12'O Clock Teaser: రామ్ గోపాల్ వర్మ రివర్స్ గేర్.. టీజరే ఇలా ఉంటే మరి సినిమా!!


ఓ వైపు దేశాన్ని కరోనా మహమ్మారి భయపెడుతుంటే.. మరోవైపు తానూ ఇందులో భాగం పంచుకుంటా, ప్రేక్షకులను భయపెడతా అంటూ రంగంలోకి దిగుతున్నారు . ట్రెండ్ ఫాలో అవుతూ సినిమాలు రూపొందించే ఆయన ఈ సారి రివర్స్ గేర్ వేసి తిరిగి తన రెగ్యులర్ ట్రాక్ లోకి వెళ్లారు. గతంలో ఎలాగైతే హారర్ సినిమాలతో భయపెట్టారో.. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు. ఈ మేరకు ఎవ్వరూ ఊహించని విధంగా మూవీ ప్రకటించారు. అంతేకాదు ఆ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు. ఈ లాక్‌డౌన్ వేళ ఒక్కో దర్శకనిర్మాత సినిమాలు ఎలా షూట్ చేయాలి? అని ప్లాన్ చేస్తుండగానే తాను అందరిలో డిఫరెంట్ అని మరోసారి నిరూపిస్తూ రామ్ గోపాల్ వర్మ ఇలా వరుస సినిమాలను ప్రకటిస్తుండటం విశేషం. Also Read: ఇక 12'O Clock మూవీ టీజర్ విషయానికొస్తే.. ఒక నిమిషం 47 సెకనుల నిడివితోనే అందరినీ భయపెట్టేశారు వర్మ. ఈ వీడియోలో చూపించిన సన్నివేశాలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. దీంతో టీజరే ఇలా ఉంటే మరి సినిమా ఎలా ఉండబోతోంది? అని అంచనా వేస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ మూవీ ఈ మధ్య వర్మ రిలీజ్ చేసిన ‘క్లైమాక్స్, నగ్నం’ లాగా షార్ట్ ఫిలిం కాదు. ఫుల్ లెంగ్త్ సినిమా. ఈ విషయాన్ని వర్మ ప్రకటిస్తూ.. 12'O Clock మూవీతో 1 గంట 45 నిముషాలు భయపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండటం స్పెషల్ అట్రాక్షన్.


By July 04, 2020 at 08:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-12o-clock-movie-teaser-released/articleshow/76779751.cms

No comments