మాస్క్ వేసుకోలేదని వివాదం.. గుంటూరు జిల్లాలో యువతి దారుణ హత్య


బయటికి వచ్చిన సమయంలో మాస్క్ ధరించలేదంటూ ఓ కుటుంబంపై స్థానికులు జరిపిన దాడిలో యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లా రెంటచింతలలో జరిగింది. 8 రోజుల క్రితం ఈ దాడి జరగ్గా బాధితురాలు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. మండల కేంద్రంలో ఉంటున్న కర్నాటి యలమంద రిక్షా కార్మికుడు. ఈ నెల 3న మొహానికి మాస్క్ ధరించకుండా బజారుకు వెళ్లిన అతడిని అన్నపరెడ్డి మల్లికార్జున, శ్రీను, వెంకటేశ్, సాంబ అనే నలుగురు స్థానికులు మందలించారు. Also Read: కాసేపటికి అదే బజారులో నలుగురు యువకులు మాస్కులు ధరించకుండా కనిపించడంతో యలమంద భార్య భూలక్ష్మి వారిని నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన ఆ యువకులు యలమంద కుటుంబంపై కర్రలతో దాడి చేశారు. తన తల్లిదండ్రులకు కొట్టొద్దంటూ అడ్డుగా వచ్చిన ఫాతిమా(19) తలపై బలంగా కొట్టారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆమెను స్థానికులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. Also Read: అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఫాతిమా పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. తండ్రి యలమంద ఫిర్యాదు మేరకు నలుగురు యువకులు అన్నపరెడ్డి మల్లికార్జున, శ్రీను, వెంకటేశ్, సాంబపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రెంటచింతల ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. Also Read:
By July 12, 2020 at 07:49AM
No comments