Breaking News

RRR సీక్రెట్ రివీల్ చేసిన శ్రీయ.. అనుష్క తర్వాత జక్కన్న దృష్టి ఆమెపైనే!


దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ ప్రాజెక్ట్ RRRలో నటించబోతోందంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో తాను కూడా భాగం కాబోతున్నట్లు స్వయంగా ప్రకటించిన శ్రీయ.. తన పాత్ర తాలూకు వివరాలు చెప్పేసింది. తాజాగా హలో యాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె.. తెలుగులో రెండు చిత్రాలకు ఓకే చెప్పానని, మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో అజయ్ దేవగన్ సరసన తాను కనిపించనున్నానని ప్రకటిస్తూ సీక్రెట్ రివీల్ చేసేసింది. దీంతో ఇన్నిరోజులుగా RRRలో శ్రీయ పాత్ర ఉందని వస్తున్న వార్తలపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. గతంలో ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందించిన 'ఛత్రపతి' సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీయ.. దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆయనతో కలిసి పనిచేయబోతోంది. మరోవైపు ఇప్పటిదాకా తన సినిమాల్లో హీరోయిన్స్ పరంగా అనుష్కను తప్ప వేరెవ్వరినీ రిపీట్ చేయని రాజమౌళి ఇప్పుడు శ్రీయను రిపీట్ చేస్తుండటం విశేషం. డీవీవీ దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్ కేటాయించి తెరకెక్కిస్తున్న RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో ఫిక్షన్ కథాంశంతో ఈ మూవీ రూపొందుతోంది. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అజయ్ దేవగన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసిన జక్కన్న త్వరలోనే మిగిలిన భాగం ఫినిష్ చేసి జనవరి 8న ఈ మూవీ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


By June 08, 2020 at 09:36AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/clarity-on-shriya-saran-role-in-rrr/articleshow/76253881.cms

No comments