Breaking News

తారక్‌తో మల్టీస్టారర్‌పై బాలయ్య.. ఎన్టీఆర్-ఏఎన్నార్ మాదిరి చెత్త సినిమాలు కాదంటూ..


మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న తరుణంలో టాలీవుడ్‌లో పవన్, చిరు, రామ్ చరణ్, బన్నీ ఇలా మెగా హీరోలంతా కలసి మల్టీస్టారర్ చేయాలని.. అలాగే నందమూరి ఫ్యాన్స్ , బాలయ్య, కళ్యాణ్ రామ్‌లు కలిసి సినిమా చేయాలని కోరుకుంటారు. అయితే నందమూరి హీరోల మల్టీస్టారర్ మూవీపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు బాలయ్య. మల్టీస్టారర్ కంటే చిన్న హీరోలతో సినిమాలు చేసుకోవడం బెటర్ అన్నారు నందమూరి బాలయ్య. ఆయన మాట్లాడుతూ.. ‘మల్టీస్టారర్ భారీ సినిమాలపై పెద్దగా ఆసక్తిలేదు. వీటికంటే చిన్న సినిమాలే బెటర్. ఇంతకు ముందు రెండు మూడు ఇన్సిడెంట్స్ ద్వారా నాకు తెలిసొచ్చింది. ఆ మల్టీస్టారర్ సినిమాలు చేయడం ద్వారా నేను బాగా దెబ్బతిన్నాను. నేను ఒక మాట అంటే దానికి రీజన్ ఉంటుంది. ఏ విషయాన్నైనా సూటిగా చెప్తా. అయితే నందమూరి హీరోలంతా ఒకే సినిమాలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మంచి కథ వస్తే చేయడానికి నాకు అభ్యంతరం లేదు. నేను కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఒకరిద్దరు ఇప్పటికే కథ చెప్పడం జరిగింది. నాకు కథ రావడం పెద్ద సమస్య కాదు.. రెండు నిమిషాల్లో వచ్చేస్తాయి. కథ గురించి ఆలోచించను. నాన్నగారు నాగేశ్వరరావుగారు చేశారు.. కొన్ని చెత్త సినిమాలు కూడా ఉన్నాయి అందులో. అయితే ఇప్పుడు మేం (ఎన్టీఆర్, బాలయ్య, కళ్యాణ్ రామ్) చేయాలంటే రేంజ్ వేరేలా ఉండాలి. బ్రహ్మాండమైన కథ అయ్యి ఉండాలి. షోలే రేంజ్ సినిమా అయ్యి ఉండాలి. అంత భారీగా బ్రహ్మాండం బద్దలయ్యే కథ అయ్యి ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చారు నందమూరి . Read Also:


By June 08, 2020 at 09:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-balakrishna-comments-about-multi-starrer-movie-with-jr-ntr/articleshow/76253526.cms

No comments