Breaking News

కోతిని కొట్టి, చెట్టుకు ఉరేసి చంపిన దుర్మార్గులు.. ఖమ్మం జిల్లాలో అమానుషం


ఇటీవల కేరళలో ఓ గర్భిణి ఏనుగుకు పేలుడు మందు కలిపిన అనాస పండు తినిపించి ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘటన దేశాన్నే కదిలించిన సంగతి తెలిసిందే. మూగజీవాలపై మనుషులు చేసే అఘాయిత్యాలకు ఆ ఘటన సాక్ష్యంగా నిలిచిందని, మానవత్వానికి మాయని మచ్చ అని సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు గళమెత్తారు. ఇప్పుడు అలాంటి ఘటనే తెలంగాణలో వెలుగుచూసింది. దాహార్తి తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వచ్చిన ఓ కోతిని కొందరు దుర్మార్గులు చెట్టుకు ఉరేశారు. అది ప్రాణాల కోసం పోరాడుతుంటే పైశాచికానందాన్ని పొందుతూ చివరికి దాన్ని చంపేశారు. Also Read: జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెంలో కోతులు తరుచూ వస్తుంటాయి. 26వ తేదీన కూడా ఇలాగే కోతుల దండు గ్రామంలోకి రావడంతో సాధు వెంకటేశ్వరరావు, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి వాటిని తరిమారు. వీటిలో ఓ తొట్టెలో నీరు తాగేందుకు ప్రయత్నించి అందులో పడిపోయింది. దాన్ని ముగ్గురూ పట్టుకొని చెట్టుకు వేలాడదీశారు. ఇతర కోతులు ఆ ప్రాంతానికి రాకుండా భయపడేలా చేసేందుకు దాన్ని చెట్టుకు ఉరేసి కర్రలతో కొట్టి చంపారు. ఆ రోజు సాయంత్రం వరకు కళేబరాన్ని అలాగే ఉంచి తరువాత గ్రామ శివారులో పడేశారు. Also Read: ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఫారెస్ట్ అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. కోతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. పైశాచిక ఘటనకు బాధ్యులైన సాధు వెంకటేశ్వరరావు, జోసెఫ్‌ రాజు, గౌడెల్లి గణపతిని శనివారం అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం నిందితులపై ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఎ.వెంకటేశ్వర్లు ఆదివారం కేసు నమోదు చేసి ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున జరిమానా విధించారు. మూగ జీవాలపై హింసకు పాల్పడేవారిని మరింత కఠినంగా శిక్షించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. Also Read:


By June 29, 2020 at 07:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/villagers-killed-monkey-with-sticks-and-hanged-in-khammam-district/articleshow/76681086.cms

No comments