Breaking News

అనసూయ ఎమోషనల్ పోస్ట్! జర్నలిస్టులంతా జాగ్రత్త..


అనసూయ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. యాంకరింగ్‌తో, యాక్టింగ్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న .. సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న కేరళా ఏనుగు అంశంలో స్పందించిన అనసూయ.. ఇప్పుడు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు బుల్లి తెర మీద, అటు వెండితెర మీద మల్టీటాలెంట్‌తో దూసుకునిపోతున్న అనసూయ.. జర్నలిస్ట్ మిత్రులు కూడా కరోనా విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. కరోనా మహమ్మారి బారిన పడి ఎంతో మంది వైద్యులు, పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే. అదే కరోనా వైరస్ కారణంగా ఓ యువ జర్నలిస్టు మనోజ్ కుమార్ మృతి చెందడంతో.. ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మనోజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలో అనసూయ స్పందించారు. కరోనా పై పోరాటంలో డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులు కూడా నిరంతరం శ్రమిస్తున్నారని, ఆ పోరాటంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. వార్తలను చేరవేస్తున్నారని గుర్తు చేస్తూనే.. ఈ క్రమంలో మనోజ్ కుమార్ అనే యువ జర్నలిస్టు మృతి తనకు బాగా కలిచివేసిందన్నారు అనసూయ. అంతేకాదు.. ‘ఎంతో మంది జర్నలిస్టులు తమ వృత్తిలో భాగంగా కరోనాపై పోరాడుతున్నారు. మీరందరూ కూడా కరోనా విషయంలో చాలా జాగ్రత్తలు పాటించడం, దయచేసి జాగ్రత్తగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు అనసూయ.


By June 09, 2020 at 08:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-anasuya-condolences-to-journalist-manoj-kumar-demise-due-to-covid-19/articleshow/76274662.cms

No comments