టెన్త్ క్లాస్‌లోనే కామ కలాపాలు.. తోటి విద్యార్థినిని గర్భవతిని చేసిన బాలుడు
ప్రేమ పేరుతో క్లాస్‌మేట్‌ను లోబరుచుకుని గర్భవతిని చేసిన పదో తరగతి విద్యార్థి నిర్వాకం జిల్లాలో వెలుగుచూసింది. అమృతలూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు జడ్పీ హైస్కూల్‌లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. అదే స్కూల్‌లో ఓ బాలిక కూడా పదో తరగతి చదువుతోంది. ఆమెపై కన్నేసిన బాలుడు ప్రేమ పేరుతో వెంటపడి దగ్గరయ్యాడు. చదువు పూర్తయి ఉద్యోగాల్లో స్థిరపడ్డాక పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో లైంగిక కోరికలు తీర్చుకునేవాడు. Also Read: వీలు చిక్కినప్పుడల్లా ఆమెను బయటకు తీసుకెళ్లి శారీరకంగా అనుభవించేవాడు. ఇటీవల బాలిక శరీరంలో మార్పులు గమనించిన ఆమె తల్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో కూతురిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి పరీక్ష చేయించగా గర్భంతో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు మైనర్ కావడంతో అతడి వివరాలు బయటకు చెప్పడం లేదు. Also Read:
By June 28, 2020 at 08:46AM
No comments