Breaking News

దేశంలో కరోనా ఉగ్రరూపం.. నిన్న ఒక్క రోజే 20వేలకుపైగా కొత్త కేసులు


దేశంలో రక్కసి ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం ఏకంగా 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోల్చితే 1,500పైగా కొత్త కేసులు నమోదుకావడం గమనార్హం. దీంతో పాజిటివ్ కేసుల్లో రోజువారీ రికార్డులు కనమరుగవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 20,060 కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా మరణాల్లో మరో రికార్డు నమోదయ్యింది. ఏకంగా 414 మంది కరోనాతో చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 529,577కి చేరగా.. మరణాలు 16,100కి చేరాయి. కరోనా నుంచి 3.10 లక్షల మంది కోలుకోగా.. 2.03 లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడచిన తొమ్మిది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదుకావడం దేశంలో వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 6,368కుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 159,133కి చేరాయి. మరో 167 మంది శనివారం ప్రాణాలు కోల్పోవడంతో మహారాష్ట్రలో కరోనా మరణాలు 7,273కి చేరాయి. మహారాష్ట్రలో శనివారం నమోదయిన మొత్తం 6,368 కేసుల్లో ముంబయిలోనే అత్యధికంగా 2,000 ఉన్నాయి. తొలిసారి ముంబయి నగరంలో తొలిసారి 2వేల మార్క్ దాటాయి. తమిళనాడులో వరుసగా నాలుగు రోజు పాజిటివ్ కేసుల సంఖ్య 3వేలకుపైగా నమోదయ్యాయి. దీంతో అక్కడ కరోనా వైరస్ కేసుల సంఖ్య 78వేలు దాటగా.. 44,000 మంది కోలుకున్నారు. మరో 33వేల మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 1,025 మంది కరోనాతో చనిపోయారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ శనివారం రికార్డుస్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోద్యాయి. మహారాష్ట్ర 6,368, తమిళనాడు 3,713, తెలంగాణ 1,087,కర్ణాటక 918, ఆంధ్రప్రదేశ్ 796, గుజరాత్ 615, బీహార్ 30, కేరళ 195, గోవా 89, పుదుచ్చేరి 87 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఢిల్లీలో 2,948, హర్యానా 543, బెంగాల్ 521 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజునే రికార్డుస్థాయిలో అత్యధికంగా 1,087 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో తొలిసారిగా ఒక్కరోజులో పాజిటివ్‌ కేసులు వెయ్యి దాటాయి. గడిచిన ఎనిమిది రోజుల వ్యవధిలో కొవిడ్‌ కేసులు రెట్టింపయ్యాయి. ఈనెల 19వ తేదీన 6,526 కేసులు ఉంటే... శనివారం నాటికి 13,436కు చేరాయి. శనివారం ఒక్కరోజులో 3,923 శాంపిల్స్‌ను పరీక్షించగా ఇందులో 27.7 శాతం పాజిటివ్‌ కేసులు రావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం ఏకంగా 796 కొత్త కేసులు నమోదు కాగా. వైరస్‌ కాటుకు మరో 11 మంది బలయ్యారు. శుక్రవారం ఉదయం వరకు నమోదైన కేసులతో పోలిస్తే శనివారం ఉదయం వరకు నమోదైన కేసుల వృద్ధి రేటు 31.5 శాతం ఉంది. కర్ణాటకలోనూ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. బెంగళూరు నగరంలో పాజిటివ్ కేసులు 2,500 దాటాయి.


By June 28, 2020 at 08:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/in-big-spike-india-adds-20000-positive-cases-in-a-day-death-toll-crosses-16000/articleshow/76669203.cms

No comments