గుంటూరులో దారుణం.. టీడీపీ కార్యకర్త హత్య
గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. జిల్లాలోని గురజాల మండలం అంబాపురంలో టీడీపీ కార్యకర్త విక్రమ్ దారుణ హత్యకు గురయ్యాడు. గత అర్ధరాత్రి బైక్‌లపై వెళ్తున్నటీడీపీ కార్యకర్తలపై కొందరు వ్యక్తులు మారణాయుధాలతో మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త దోమతోటి విక్రమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో మృతుడితో గతంలో గొడవలకు దిగిన పలువురు వ్యక్తుల్ని విచారించే పనిలో పడ్డారు.
By June 28, 2020 at 08:20AM
No comments