లోన్ ఇప్పిస్తానని నమ్మించి.. యువతిపై బ్యాంక్ మేనేజర్ అత్యాచారం

లోన్ ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతిపై బ్యాంక్ మేనేజర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో జరిగింది. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన శిశిరతాన్‌సేన్ అనే వ్యక్తి కటక్‌లోకి సెంట్రల్ బ్యాంక్ బిరబటి శాఖలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం సెలవు పెట్టి స్వస్థలానికి వెళ్లిన శిశిరతాన్‌సేన్‌కు అక్కడ ఓ యువతి పరిచయమైంది. ఆమెకు లోన్ ఇప్పిస్తానని నమ్మించి ఆమెపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల సెలవు ముగియడంతో వచ్చి విధుల్లో చేరాడు. Also Read: అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శిశిరతాన్‌సేన్‌పై కేసు నమోదు చేసుకున్న ఝార్ఖండ్ పోలీసులు కటక్ చేరుకుని చౌలియాగంజా ఠాణా పోలీసుల సహాయంతో మంగళవారం అతడిని అరెస్టు చేశారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌లోకి తీసుకుని ఝార్ఖండ్‌కు తరలించారు. Also Read:
By June 18, 2020 at 10:24AM
No comments