Breaking News

క్వారంటైన్‌ కేంద్రంలో కామాంధుడు.. కోరిక తీర్చాలంటూ యువతికి వేధింపులు


క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న వలస కార్మికురాలిపై స్థానిక గ్రామ సర్పంచ్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. జూన్‌ 1వ తేదీన తమిళనాడు నుంచి కొంతమంది వలస కార్మికులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. వారందరినీ సువర్ణపూర్‌ జిల్లాకు చెందిన ఆయా ప్రాంతాల క్వారంటైన్‌ కేంద్రాలకు పంపారు. ఇందులో అందారిబంచి క్వారంటైన్‌లో ఉన్న ఓ యువతికి ప్రత్యేక గది కేటాయించారు. గదిలో ఒంటరిగా ఉన్న యువతిపై అందారిబంచి గ్రామ సర్పంచ్ బనమాలిషా కన్నేశాడు. Also Read: క్వారంటైన్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు తరుచూ అక్కడి వచ్చే బనమాలిషా యువతిని లొంగదీసుకోవాలనుకున్నాడు. రోజూ రాత్రి సమయంలో మద్యం తాగి అక్కడికి వచ్చి తన కోరిక తీర్చాలంటూ యువతిని వేధించేవాడు. కొద్దిరోజులు ఆ వేధింపులను భరించిన బాధితురాలు ఆ తర్వాత నిర్వాహకులకు ఫిర్యాదుచేసింది. వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తన బాధనంతా వెళ్లగక్కుతూ సెల్‌ఫోన్లో వీడియో రికార్డ్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఘటన వైరల్‌గా మారింది. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు క్వారంటైన్‌ కేంద్రానికి చేరుకుని యువతి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By June 08, 2020 at 07:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sexual-harassment-on-woman-in-quarantine-centre-in-odisha-case-booked/articleshow/76252517.cms

No comments