Breaking News

కాఫీడే సిద్ధార్థ్ తనయుడితో డీకే శివకుమార్ కుమార్తె వివాహం


కర్ణాటక పీసీసీ చీఫ్‌, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్య వివాహం కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్దార్ధ కుమారుడు అమర్త్య హెగ్డేతో జరగనుంది. ఇరు కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా స్నేహం కొనసాగునుండగా.. పెళ్లితో బంధుత్వం ఏర్పడనుంది. వాస్తవానికే గతేడాది ఈ వివాహం జరరగాల్సి ఉండగా.. ఆత్మహత్యతో వివాహం ఆగిపోయింది. గత జూలైలో వీజీ సిద్దార్ధ ఆత్మహత్య ఘటన దేశ్యవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. సిద్దార్థ ఉన్నప్పుడే ఈ వివాహ ప్రస్తావన వచ్చిందని డీకే శివకుమార్‌ తెలిపారు. శివకుమార్‌ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య ఇంజనీరింగ్‌ పూర్తి చేసి తన వ్యాపార కార్యకలాలను చూసుకుంటున్నారు. అమెరికాలో విద్యాభ్యాసం పూర్తిచేసిన అమర్త్య సైతం తండ్రి వ్యాపార బాధ్యతలను చేపట్టారు. పెళ్లి గురించి చర్చించేందుకు గత ఆదివారం సిద్ధార్థ ఇంటికి డీకే శివకుమార్‌ కుటుంబసభ్యులు వెళ్లి సంబంధం ఖాయం చేశారు. జులై 31 నాటికి సిద్దార్థ ఆత్మహత్యకు పాల్పడి ఏడాది పూర్తికావస్తోంది.. ఆ తరువాత వివాహ తేదీల నిర్ణయంపై స్పష్టత వస్తుంది.. పెళ్లిలు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి.. అంతా దైవ నిర్ణయం.. అని వ్యాఖ్యానించారు. ఆగస్టులో నిశ్చితార్థం ఉంటుందని కుటుంబానికి సన్నిహితులు తెలిపారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడైన వీజీ సిద్ధార్థ 2019 జులైలో అదృశ్యమయ్యారు. తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆర్థిక సమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. ఆ తరువాత ఆయన వ్యాపారాలను సిద్ధార్థ భార్య మళవికా చూసుకుంటున్నారు.


By June 06, 2020 at 10:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ex-minister-kpcc-president-dk-shivakumars-daughter-to-marry-vg-siddharthas-son/articleshow/76228744.cms

No comments