Breaking News

ఐదుగురు ఈడీ అధికారులకు కరోనా.. ఆఫీసు రెండు రోజులు సీల్


న్యూఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఐదుగురు అధికారులకు నిర్ధారణ అయ్యింది. దీంతో ఈడీ ఆఫీసును మూసివేసి, శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. మొత్తం ఆరుగురు అధికారులకు వైరస్ సోకినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల పాటు కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. వీరితో కాంటాక్ట్‌లో ఉన్న మొత్తం 10 మంది అధికారులను గుర్తించి, క్వారంటైన్‌కు తరలించినట్టు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్‌లో ఈడీ హెడ్‌క్వార్టర్స్ ఉంది. రెండు రోజుల పాటు సీల్ చేసి శానిటైజేషన్ చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, ఢిల్లీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నవారిలో సగటున ప్రతి నలుగురిలో ఒకరకి పాజిటివ్‌గా తేలుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సశస్త్ర సీమ బల్‌(ఎస్‌ఎస్‌బీ)కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఒకరు కొవిడ్‌తో మృత్యువాతపడ్డారు. ఎస్‌ఎస్‌బీలో కరోనా సంబంధిత తొలి మరణం ఇదే. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ఇది తొమ్మిదో మరణం. గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీలో భారీగా కరోనా వైరస్ కేసుల నమోదవుతున్నాయి. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రిలో ఏకంగా 480 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ బారిన పడి ఎయిమ్స్‌లో ఇప్పటికే ముగ్గురు మరణించారు. వీరిలో ఒకరు ఎయిమ్స్‌ శానిటేషన్ విభాగంలో ఉన్నతాధికారి కాగా.. మరొకరు ఆస్పత్రి మెస్‌లో పనిచేసే ఉద్యోగి. కరోనా బారిన పడిన సిబ్బందిలో 38 మంది నర్సులు కూడా ఉండటం వీరి ఆందోళనకు కారణం. తమకు అందిస్తున్న పీపీఈ కిట్లు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఆరోపిస్తున్నారు.


By June 06, 2020 at 11:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-ed-officials-test-positive-headquarters-in-delhi-sealed/articleshow/76229149.cms

No comments