ఇంట్రస్టింగ్ అప్డేట్.. ప్రభాస్ దేవుడా? ఫ్యాన్స్‌కి పండగే!
బాహుబలి చిత్రంతో సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అయిన .. ‘సాహో’ చిత్రంతో నిరాశపరిచారు. ప్రస్తుతం ఆయన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా. ఈ చిత్రానికి ‘ఓ డియర్’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే ప్రభాస్‌తో జోడీ కడుతోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మహానటి దర్శకుడు దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్‌లో ఉండబోతోందని సమాచారం. ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. మానవుడు దేవకన్యకి పుట్టిన పిల్లోడు భూమి మీద ఎలాంటి విన్యాసాలు చెయ్యగలడు అన్న సోషియో ఫాంటసీ కథతో ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. అయితే ఈ కథ ప్రజెంట్ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యేలా సైన్స్ అండ్ దేవుడు అనే అంశాల చుట్టూ ఉండబోతుందట. మరో ఆసక్తికరమైన విషయంతో ఏంటంటే ప్రభాస్‌ని దేవుడిగా చూపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలియదు కాని.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. తాము దేవుడిగా భావించే ప్రభాస్‌ని నాగ అశ్విన్ దేవుడిగా చూపించబోతుండటంతో ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే కథ విషయంలో చాలా పగడ్బందీగా ఉండే నాగ్ అశ్విన్ లీక్‌ల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటారు. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ సోషియో ఫాంటసీ కథ నిజమా కాదా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
By June 04, 2020 at 08:58AM
No comments