మూవీ లవర్స్‌కి ఊహించని షాక్.. థియేటర్లపై కేంద్రం సంచలన నిర్ణయం
కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్రం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 2 లక్షలు దాటాయి. గత పదిహేను రోజుల్లో లక్ష కేసులు రావడం ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తుంది. దాదాపు రెండు నెలలుగా మూత బడిన దుకాణాలు, షాపింగ్ మాల్స్ ప్రజా అవసరాలకు సంబంధించినవన్నీ తెరుచుకున్నాయి. ఒక్క థియేటర్స్, బార్స్, రెస్టారెంట్లు, పబ్‌లు తప్ప మిగిలినవన్నీ ఓపెన్ అయ్యాయి. ఇక సినిమా, సీరియల్ షూటింగ్‌లకు పర్మిషన్స్ లభించగా.. రేపో మాపో థియేటర్స్ ఓపెన్ కావడం ఖాయంగానే కనిపించింది. కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కోరంగానికి సడలింపులు ఇస్తూ వస్తున్న కేంద్రం థియేటర్ల విషయంలో ఉన్న లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తుందని భావించాయి. చలన చిత్ర రంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని కేంద్ర మంత్రి జవదేకర్ దృష్టికి తీసుకుని వెళ్లగా.. ఆయా రంగాలకు సంబంధించిన ప్రతినిధులతో చర్చలు జరిపిన ఆయన.. దేశ వ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే అంశాన్ని జూన్ తరువాతే పరిశీలస్తామని తెలియజేశారు. సడలింపుల తరువాత కేసుల సంఖ్యని బట్టి థియేటర్లపై నిర్ణయం ఉంటుందని మంత్రి తెలిపారు. అయితే కోవిడ్ కేసులో ఒక్కసారిగా పెరిగిపోవడంతో మరో మూడు నెలలు పాటు.. అంటే జూన్, జూలై, ఆగష్టు వరకూ థియేటర్స్ బొమ్మ పడటం కష్టంగానే మారింది. మొత్తానికి అన్నింటితో పాటు థియేటర్స్ కూడా ఓపెన్ అవుతాయన భావించిన మూవీ లవర్స్ ఆశలు తీరాలంటే మరో మూడు నెలల వరకూ వేచిచూడాల్సిందే.
By June 04, 2020 at 08:29AM
No comments