వివాహితను బెదిరించి ఆఫీసులోనే అత్యాచారం.. కలెక్టర్‌పై రేప్ కేసు
జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారి కలెక్టరేట్‌లోనే మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తున్న తన భర్తను డిస్మిస్ చేస్తానని బెదిరించి జంగజీర్ చాంఫ్ జిల్లా కలెక్టరుగా పనిచేసిన జనక్ ప్రసాద్ పాథక్ తనను ఛాంబర్‌కు పిలిపించుకుని లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ మహిళ(33) పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: కొన్నాళ్లుగా కలెక్టర్ తనకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారని, మే 15వ తేదీన తన ఛాంబర్‌కు పిలిపించి చేశారని జిల్లా ఎస్పీ పారుల్ మాధూర్‌కు ఇచ్చి ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఎస్పీకి అందజేసింది. దీంతో పోలీసులు జనక్ ప్రసాద్‌పై ఐపీసీ 376, 506, 509(బి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read: జనక్ ప్రసాద్ పాథక్‌ను ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా మే 26వ తేదీన ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ని ఇంకా అరెస్ట్ చేయలేదని, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలపై జనక్ ప్రసాద్ ఇంకా స్పందించలేదు. ఆయన నిజంగానే అత్యాచారం చేశారా? బాధితురాలు చెబుతున్నది నిజమేనా? కాదా? అన్నది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. Also Read:
By June 04, 2020 at 08:48AM
No comments