ఆన్‌లైన్ రమ్మీకి బానిసై.. పనిచేస్తున్న బ్యాంకుకే రూ.కోటిన్నర టోకరా
భవిష్యత్ అవసరాల కోసం ప్రజలు బ్యాంకులో దాచుకున్న సొమ్మును క్యాషియర్ గుట్టుచప్పుడు కాకుండా కొట్టేసిన ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో వెలుగులోకి వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)లో క్యాషియర్‌గా పనిచేస్తున్న గుండ్ర రవితేజ బ్యాంకులో కస్టమర్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి ఏకంగా రూ.1.56 కోట్లు తన అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గుండ్ర రవితేజ పీఎన్‌బీ బ్రాంచిలో హెడ్ క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. Also Read: కొంతకాలంగా ఆన్‌లైన్ రమ్మీ, కాసినో గేమ్స్‌కు బానిసైన అతడు రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. తన దగ్గర డబ్బులన్నీ అయిపోవడంతో బ్యాంకులో ప్రజలు దాచుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ముపై అతడి కన్ను పడింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా కస్టమర్ల అకౌంట్లలో నుంచి తన అకౌంట్‌కు రూ.1,56,56,897 నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకుని ఆ సొమ్మంతా రమ్మీ, కాసినో ఆటల కోసం వినియోగించుకున్నాడు. బ్యాంకులో నగదు లెక్కల్లో తేడా రావడంతో అనుమానం వచ్చిన బ్యాంచి మేనేజర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పీఎన్‌బీ విజయవాడ సర్కిల్ చీఫ్ మేనేజర్ ఎం.నాగేశ్వరరావు బుధవారం నూజివీడు బ్రాంచిలో తనిఖీ చేయగా బండారం బయటపడింది. దీంతో బ్యాంకు అధికారులు నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు రవితేజను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. Also Read:
By June 04, 2020 at 09:13AM
No comments