Breaking News

కరోనా కన్నా ప్రమాదకర సంగీతం.. బాలయ్యను టార్గెట్ చేసిన నాగబాబు


నిన్నమొన్నటివరకు టాలీవుడ్‌లో బాలయ్య, నాగబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు జరిపిన చర్చలకు తనని పిలవలేదని బాలయ్య చెప్పిన మాటలు పెను దుమారాన్ని రేపాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకోవడానికి మాత్రమే కలిసారంటూ కామెంట్స్ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై మెగా బ్రదర్.. బాలయ్యను నోరు అదుపులో పెట్టుకోమంటూ చెప్పిన మాటలు దుమారం రేపాయి. ఆ తర్వాత మళ్లీ నాగబాబు ఓ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. బాలకృష్ణతో తనకెలాంటి విభేదాలు లేవన్నారు. భూములు విషయమై ఆయన మాట్లాడినందుకే ఆవేశపడ్డానన్నారు. ఆ వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు బాలకృష్ణపై మరోసారి పరోక్షంగా సెటైర్లు వేశారు నాగబాబు. ఇవాళ బాలకృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఒకరోజు ముందే అనగా నిన్న సాయంత్రం 5 గంటల 03 నిమిషాలకు బాలయ్య పాటను ఎన్‌బీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశారు. ఇందులో బాలయ్య తన తండ్రి, నందమూరి తారక రామరావు ఎవర్ గ్రీన్ పాట‘శివశంకరి శివానంద లహరి’ని ఆలపించారు. శివశంకరీ అంటూ రాగం మొదలుపెట్టిన బాలయ్య.. ఎక్కడా శృతి తప్పకుండా పాడి అలరించారు. అయితే ఇప్పుడు బాలయ్య పాటపై పరోక్షంగా ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు నాగాబాబు. ‘కారోన జబ్బు కన్నా ప్రమాదకరమైన సంగీతం circulate అవుతుందిరా అయ్యా.జాగ్రత్తరా అయ్యా..దండం పెడతాను...అయ్యబాబోయ్ చిన్న పిల్లలని old age వాళ్ళని,హెల్త్ బాగలేని వాళ్ళని సంగీతం వినకుండా చూసుకోండి.విన్నారంటే ఏదేన జరగొచ్చు.....అయినా ఎందయ్యా ఇది..ఇది నేను చూళ్లే..ఎక్కడ ఇనలే.’ అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు మెగా బ్రదర్. అంతేకాదు ఓ ఏడుపుగొట్టు ఎమోజీని కూడా పోస్టు చేశారు. అయితే ఆ పోస్టు పెట్టిన గంటకు వెెంటనే డిలీట్ కూడా చేశారు.


By June 10, 2020 at 09:23AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nagababu-konidela-satires-on-nandamuri-balakrishna/articleshow/76294700.cms

No comments