Breaking News

మా బాలకృష్ణ అంటూ.. చిరంజీవి ఆసక్తికర ట్వీట్


ఇవాళ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇది బాలయ్యకు 60వ పుట్టినరోజు. దీంతో నందమూరి కుటుంబం షష్టిపూర్తి సంబరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు సినీ,రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తును శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఇటీవలే సోషల్ మీడియాలోకి వచ్చిన మెగస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలిపారు. మా బాలయ్య అంటూ చిరు అప్యాయంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey.Happy birthday’ అంటూ చిరు ట్వీట్ చేశారు. చిరంజీవి చేసిన ఈ ట్వీట్‌తో ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా నెలకొన్న వివాదాలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. సినీ ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు తనను ఆహ్వానించకపోవడంపై బాలకృష్ణ బహిరంగ విమర్శలు చేయడం తెలిసిందే. బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు సీరియస్ కావడంతో వివాదం మరింత ముదిరింది. పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వివాదంపై తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తూ వివాదాన్ని చల్లార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. చిరంజీవిని టార్గెట్ చేస్తూ బాలయ్య పలు ఇంటర్య్వూలో అనేక విమర్శలు కూడా చేశారు.


By June 10, 2020 at 09:40AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-birthday-wishes-to-nandamuri-balakrishna/articleshow/76294840.cms

No comments