Breaking News

పిల్లనిచ్చిన మామనే కిరాతకంగా చంపేసిన అల్లుడు.. నల్గొండలో దారుణం


కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పిల్లనిచ్చిన మామనే దారుణంగా చంపేసిన ఘటన నల్గొండ‌ పట్టణంలోని రామ్‌నగర్‌లో ఆదివారం జరిగింది. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన చింతల గోపికి గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వెంటకలక్ష్మీతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరు నల్గొండలోని రామ్‌నగర్‌లో ఉంటూ పాతసామాను సేకరణ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. దంపతుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వెంకటలక్ష్మి తండ్రి ఒంటిపల్లి వెంకటేశ్వర్లు(45) నాలుగు రోజుల క్రితం కూతురి ఇంటికి వచ్చాడు. Also Read: ఆదివారం మామా, అల్లుడు కలిసి ఫుల్లుగా మద్యం తాగారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో గోపీ కోపంతో రెచ్చిపోయి పక్కనే ఉన్న రోలు తీసుకుని మామ వెంకటేశ్వర్లు తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంకటేశ్వర్లు అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంకటలక్ష్మి స్థానికుల సాయంతో తన తండ్రిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నల్గొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By June 22, 2020 at 08:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/drunked-man-brutally-kills-father-in-law-in-nalgonda-town/articleshow/76501999.cms

No comments