ఏపీలో దారుణం.. మరదలిని గొడ్డలితో నరికిన బావ
లాక్ డౌన్‌తో కొన్నాళ్లు పాటు ఎలాంటి నేరాలు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు సడలింపులు చేయడంతో నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. తాజాగా అన్నదమ్ముల మధ్య చోటు చేసుకున్న ఆస్తి వివాదం ఓ మహిళ ప్రాణం తీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదం నేపథ్యంలో సొంత తమ్ముడి భార్యను మరదలని కూడా చూడకుండా గొడ్డలితో నరికి హతమార్చాడు. నందికొట్కూరు మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చిన్న ఏసన్న, పుష్పరాజు అన్నదమ్ములు. ఇంటి స్థలం విషయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. ఇదే విషయమై తమ్ముడి భార్య శ్రీలేఖ, చిన్న ఏసన్న శుక్రవారం గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. అక్కడే ఉన్న గొడ్డలి తీసుకొని మరదలి మెడపై విచక్షణా రహితంగా నరికాడు. దీంతో శ్రీలేఖ అక్కడికక్కడ కుప్పకూలింది. రక్తపు మడుగులో పడివున్న బాధితురాలిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే శ్రీలేఖ మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జయశేఖర్ తెలిపారు.
By June 06, 2020 at 12:25PM
No comments