ఐదేళ్లు సహజీవనం చేసి.. పెళ్లి చేసుకోమంటే పారిపోయాడు

సహోద్యోగితో ప్రేమ వ్యవహారం నడిపి ఐదేళ్లు సహజీవనం చేసి పెళ్లికి మొహం చాటేసిన యువకుడిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన శరత్‌బాబు(32) కొన్నాళ్లుగా ఎర్రగడ్డలో నివాసముంటూ బంజారాహిల్స్ రోడ్డు నంబరు 1లోని ఓ భవనంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. బోరబండ ప్రాంతానికి చెందిన ఓ యువతి అదే భవనంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఐదేళ్ల క్రితం వీరిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. Also Read: పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించిన శరత్‌బాబు ఆమెతో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ శారీరకంగానూ కలిశారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని ఇటీవల యువతి కోరగా అతడు నిరాకరించాడు. ఇన్నాళ్లూ కలిసి ఎంజాయ్ చేశాం.. ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుందామని చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By June 11, 2020 at 07:16AM
No comments