మాజీ ప్రియుడితో నయన్ రొమాన్స్! ప్రభుదేవా- నయనతార కాంబోపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ప్రభుదేవా- నయనతార.. ఈ జోడీ పేరు వినిపిస్తే చాలు ఎక్కడికో వెళ్ళిపోతుంది ప్రేక్షకలోకం. ఎందుకంటే ఒకప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగితేలి పెళ్లి పీటల వరకూ వెళ్లిన ఈ జంట అనూహ్యంగా విడిపోయింది. వీళ్ల బ్రేకప్ విషయమై ఎన్నో వార్తలు షికారు చేశాయి. కాగా అప్పటినుంచి దూరం దూరంగా ఉంటున్న వాళ్లిద్దరూ మరోసారి తెర పంచుకోబోతున్నారని, ఈ మూవీతో మళ్ళీ దగ్గర కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు రావడం పలు అనుమానాలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత ఈశ్వరి కె.గణేశ్ రియాక్ట్ అవుతూ అసలు విషయం చెప్పేశారు. రెండేళ్ల క్రితం ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, కార్తి హీరోలుగా మొదలుపెట్టిన సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఈశ్వరి కె.గణేశ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఇప్పుడు కథలో కొన్ని మార్పులు చేసి ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారని.. ఇందులో ప్రభుదేవా, నయనతార కూడా నటిస్తారని వార్తలు వినిపించాయి. దీంతో మరోసారి నయన్- దగ్గర కానుండటం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. Also Read: ఈ క్రమంలో తాజాగా ఇదే విషయమై స్పందించిన నిర్మాత ఈశ్వరి కె.గణేశ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుదేవా, నయనతార కలిసి నటిస్తారని వినపడుతున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. ప్రభుదేవాతో తాను సినిమా తీయాలనుకుంటున్న మాట వాస్తవమే అయినప్పటికీ ఇంకా ఎలాంటి చర్చలు జరపలేదని అన్నారు. దీంతో ప్రభుదేవా- నయనతార కాంబోపై వస్తున్న వార్తలను ఫుల్‌స్టాప్ పడింది.
By June 05, 2020 at 10:58AM
No comments