Breaking News

కోవిడ్-19తో కన్నుమూసిన రామకృష్ణ మిషన్ భక్తురాలు డాక్టర్ లిలీ తోలట్


ముంబయి విభాగానికి చెందిన భక్తురాలు, ప్రముఖ (96) గురువారం కన్నుమూశారు. కొద్ది రోజుల కిందట బారినపడిన ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనాతో హాస్పిటల్‌లో చేరడానికి ముందు వరకూ ఆమె రోగులకు సేవలను అందజేశారు. చారిటబుల్ హాస్పిటల్‌లో వైద్యురాలిగా చివరి రోజుల వరకూ సేవలు అందించడం విశేషం. లాక్‌డౌన్ సమయంలో రోగులను పరీక్షించేవారు. ‘నా కోసం గుమ్మం ముందు వేచి ఉన్న రోగులను చూడటం నా కర్తవ్యం’ అని లీలా తోలట్ చెప్పేవారు. మరోవైపు, కరోనా వైరస్‌ మహమ్మారి మహారాష్ట్రను అతలాకుతలం చేస్తోంది. ప్రతిరోజు ఇక్కడ కొత్తగా 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. అక్కడ మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 80వేల మార్క్కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 2700మందికిపైగా మృత్యువాతపడ్డారు. ఇక్కడ నమోదవుతున్న కేసుల్లో దాదాపు 58శాతం ముంబయి మహానగరంలోనే చోటుచేసుకుంటున్నాయి. నగరంలో ఇప్పటివరకు 44వేల కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కేవలం ముంబయి నగరంలోనే కరోనా మరణాల సంఖ్య 1500 దాటింది. నగరంలోని ధారవి ప్రాంతంలో ఇప్పటివరకు 1830 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ముంబయిలో కొవిడ్‌ చికిత్స అందిస్తోన్న ఆసుపత్రుల్లోని ఐసీయూ పడకలు ఇప్పటికే రోగులతో నిండిపోయాయి. అంతేకాకుండా వైరస్‌ తీవ్రత అధికంగా ఉండడంతో వైద్యులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నట్లు కొంద వైద్యసంఘాలు మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. కోవిడ్-19కి చికిత్స అందజేస్తున్న పలువురు వైద్యులు కూడా ఈ మహమ్మారికి బలవుతున్నారు.


By June 06, 2020 at 05:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ramakrishna-mission-mumbai-devotees-doctor-lily-tolet-passed-away-due-to-covid/articleshow/76226662.cms

No comments