వైజాగ్ దివ్య హత్యకేసు: వెలుగులోకి సంచలన విషయాలు.. ఆమె జీవితమంతా విషాదమే
పోలీసులు విచారణలో దివ్య జీవితానికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2015లో ఆమె స్వగ్రామంలో జరిగిన వివాదాల్లో దివ్య తల్లి, సోదరుడు, అమ్మమ్మ దారుణ హత్యకు గురికావడంతో ఆమె అనాథగా మిగిలింది. చిన్న వయస్సులోనే వివాహం కావడంతో దివ్యను కొద్ది రోజులకే భర్త వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అదే ఊరులోని పిన్ని, బాబాయి వద్ద ఉండేది. ఆమె బాబాయికి విశాఖలోని ఎన్‌ఏడీలో నివాసం ఉండే గీత అనే మహిళతో అక్రమ సంబంధం ఉంది. దీంతో దివ్య ద్వారా అక్రమ మార్గంలో డబ్బు సంపాదించొచ్చని ఆమె ఇచ్చిన సలహాతో బాబాయి దివ్యను గీతకు అప్పగించాడు.
Also Read:
విశాఖలో యువతి మృతి.. శరీరంపై సిగరెట్ వాతలు.. వ్యభిచార కోణం?
అయితే అక్కడ ఇమడలేక దివ్య కొద్దిరోజులకే పారిపోయింది. ఈ క్రమంలోనే నగరంలోని ద్వారకా బస్‌స్టేషన్‌లో ఒంటరిగా తిరుగుతున్న ఆమెకు వసంత పరిచయమైంది. తాను ఆశ్రయం కల్పిస్తానని దివ్యను నమ్మించిన వసంత అక్కయ్యపాలెంలోని తన ఇంటికి తీసుకెళ్లింది. వసంత భర్త దుబాయిలో ఉంటుండటంతో ఆమె ఇక్కడ గుట్టుగా వ్యభిచారం చేసేది. ఈ క్రమంలోనే అందగత్తె అయిన దివ్యను కూడా మాయమాటలతో వ్యభిచారంలోకి దించింది. 8 నెలలుగా దివ్య ఆమె ఇంట్లోనే ఉంటూ వ్యభిచారం ద్వారా డబ్బులు సంపాదిస్తూ నెలనెలా బాబాయి పంపిస్తోంది.
Also Read:
విశాఖ దివ్య హత్య కేసులో వీడిన మిస్టరీ
కొంతకాలం తర్వాత నగదు పంపకాల్లో తేడా రావడంతో వసంత, దివ్య మధ్య గొడవలు తలెత్తాయి. తన శరీరంతో వ్యాపారం చేస్తూ తనకే తక్కువ డబ్బులు ఇస్తారా? అని దివ్య నిలదీసింది. దీంతో వసంత, మరికొందరితో కలిసి ఆమెను గదిలో బంధించి చిత్రహింసలు పెట్టింది. గుండు, కనురెప్పలు తీసి అందవిహీనంగా మార్చేసింది. కొద్దిరోజుల పాలు అన్నం కూడా పెట్టకుండా కడుపు మాడ్చేంది. ఆమె పెట్టే చిత్రహింసలు తట్టుకోలేకపోయిన దివ్య ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో దివ్య బాబాయి పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తు వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read:
ప్రియుడితో పెళ్లి ఫోటోలు వైరల్.... కాబోయే భర్తకు తెలిసిపోయిందని యువతి ఆత్మహత్య
By June 07, 2020 at 08:12AM
No comments