Breaking News

వకీల్ సాబ్ లీక్: కోర్టులో పవన్ కళ్యాణ్! అది చూడగానే షాకైన దర్శకనిర్మాతలు


ఓ స్టార్ హీరో సినిమాను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేయాలంటే చాలా కష్టం. ఎంతో మంది నిపుణులు, సాంకేతిక వర్గం సహకారంతో సినిమా రూపొందించడం, అది కూడా విడుదలకు ముందు ఎలాంటి లీక్స్ లేకుండా వెండితెరపై బొమ్మపడేలా చూసుకోవడమంటే మామూలు విషయం కాదు. మరోవైపు టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది సినిమా ఇండస్ట్రీని లీకుల బెడద ఎక్కువవుతూ వస్తోంది. తాజాగా పవర్ స్టార్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్‌కు కూడా లీకుల బెడద తప్పలేదు. ‘’ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ గత కొంతకాలంగా కరోనా విజృంభణ వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా జాగ్రత్త పడుతూ వస్తున్న చిత్ర యూనిట్‌కి సడెన్ షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్‌లో కోర్టులో వాదిస్తున్న స్టిల్ ఒకటి లీక్ అయింది. ఇది కాస్త వెంటనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ స్టిల్ ఎలా లీక్ అయ్యిందనే విషయమై ఆరా దీస్తున్నారు యూనిట్ సభ్యులు. Also Read: మెగాస్టార్ తమ్ముడిగా సినీ రంగప్రవేశం చేసి వరుసగా 25 సినిమాలు చేసిన పవన్.. ఆ తర్వాత రాజకీయ బాట పట్టారు. అయితే నిర్మాతల కోరిక మేరకు తిరిగి కెమెరా ముందుకొచ్చిన ఆయన మొదటగా ఈ 'వకీల్ సాబ్' మూవీ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నివేదా థామస్, అనన్య నాగేళ్ల, అంజలి నటిస్తున్నారు. ఈ ముగ్గురే గాక మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని సమాచారం.


By June 29, 2020 at 11:47AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pawan-kalyans-vakeel-saab-leaked-still-viral-on-social-media/articleshow/76684464.cms

No comments