Breaking News

పెళ్లైన ఐదు రోజులకే రోడ్డుప్రమాదంలో వరుడి మృతి.. కర్నూలులో విషాదం


పెళ్లైన ఐదు రోజులకే వరుడు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన జిల్లాలో జరిగింది. హొళగుంద మండలం సమ్మతగేరి గ్రామానికి చెందిన మారేష్‌(23)కు ఈనెల 17న హొళగుందకు చెందిన రేణుక అనే యువతితో వివాహం జరిగింది. ఆదివారం అమావాస్య కావడంతో కొత్త జంట హాలహర్వి మండలం అమృతాపురంలో వెలసిన టోపి మారెమ్మవ్వను దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనం పూర్తి చేసుకుని స్వగ్రామానికి వస్తుండగా సిద్ధాపురం గ్రామం వద్ద కోగిలతోట వైపు నుంచి వేగంగా వస్తున్న బైక్‌ వీరిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో వరుడు మారేశ్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వధువు కూడా గాయపడింది. Also Read: సమాచారం అందుకున్న బంధువులు వెంటనే అక్కడికి చేరుకుని ఇద్దరినీ ఆదోనికి, అక్కడి నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మారేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి ముందు వేసిన పందిరి తీయకుండానే వరుడి చనిపోవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By June 22, 2020 at 07:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/groom-dies-in-road-accident-in-kurnool-district-after-5-days-of-marriage/articleshow/76501900.cms

No comments