Breaking News

బాలికను కిడ్నాప్ చేసి కారులోనే అఘాయిత్యం.. ఇద్దరిపై కేసు


మైనర్ బాలికను కిడ్నాప్ చేసి కారులోనే అత్యాచారానికి యత్నించిన ఘటనలో జిల్లా పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన బాలిక (17) ఏడాది కాలంగా ఆకివీడు మండలంలోని ఓ గ్రామంలో తన నాయనమ్మ ఇంటి వద్ద ఉంటోంది. ఈ నెల 7న అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బాలిక కనిపించకపోవడంతో నాయనమ్మ ఆకివీడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: మరోవైపు బాలికను మహబూబ్‌నగర్ తీసుకెళ్లిన దుండగులు అక్కడ కారులోనే ఆమెపై అత్యాచారానికి యత్నించారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తర్వాత బాలిక హైదరాబాద్‌లో ఉండే తన తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం చేరవేసింది. దీంతో తన కూతురిని వెంటబెట్టుకుని ఆయన శుక్రవారం ఆకివీడు చేరుకుని ఫిర్యాదు చేశాడు. బాలిక నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు, అతడికి సహకరించిన కారు డ్రైవర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. Also Read:


By June 13, 2020 at 10:37AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/west-godavari-pocso-case-booked-on-two-men-for-kidnap-and-try-to-rape-on-girl/articleshow/76352488.cms

No comments