Breaking News

దొంగ పెళ్లి చేసుకుని కాపురం.. అబార్షన్ చేయించి మొహం చాటేశాడు


ప్రేమ పేరుతో యువతికి వలేసి పెళ్లి చేసుకుని కాపురం పెట్టిన ఓ యువకుడు.. మోజు తీరాక ఆమెను వదిలించుకోవాలని చూస్తున్న ఘటన జిల్లాలో వెలుగుచూసింది. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ఏడాది క్రితం ఆమెను దొంగచాటుగా పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో కాపురం పెట్టాడు. ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో ఏవో మాత్రలు మింగించి అబార్షన్ చేయించాడు. Also Read: కొద్దిరోజుల తర్వాత కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించాడు. కట్నకానుకలు తీసుకురాకపోతే కాపురం చేయనంటూ వేధింపులకు గురిచేశాడు. దీంతో గ్రామానికి చేరుకున్న యువతి పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టింది. వారి సమక్షంలో ఈ 14న పెళ్లి చేసుకుంటానని యువకుడు హామీ ఇచ్చాడు. అప్పటి నుంచి అతడు తప్పించుకుని తిరుగుతుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన భర్తతో కాపురం చేయించేలా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By June 22, 2020 at 11:25AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-complaints-on-husband-in-medak/articleshow/76504487.cms

No comments