Breaking News

ఉద్యోగం పేరుతో పైశాచికం... యువతిని నిర్బంధించి 2 నెలలుగా గ్యాంగ్ రేప్


రాజధాని భువనేశ్వర్‌లో దారుణ ఘటన జరిగింది. ఉద్యోగం పేరుతో యువతిని ప్రలోభపెట్టిన కొందరు కామాంధులు ఓ హోటల్‌లో ఆమెను నిర్బంధించి రెండు నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనపై సామాజిక కార్యకర్త రీనా రౌత్రాయ్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు సోషల్‌మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు. రీనా కథనం ప్రకారం... ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె మేనత్త మార్చి నెలలో ఇంటికి తీసుకొచ్చింది. మార్చి 20న నందన్ అనే వ్యక్తి వద్దకు ఆమెను పంపింది. ట్రైనింగ్ పేరుతో నందన్ ఆమెను ఓ హోటల్‌ గదిలో ఉంచాడు. ఈలోగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో యువతి ఇంటికి వెళ్లలేక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. Also Read: దీన్ని అవకాశంగా తీసుకున్న నందన్ రోజూ తన ఫ్రెండ్స్‌తో కలిసి గదికి వెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడేవాడు. తమకు సహకరించకపోతే చంపేస్తామని ఆ కామాంధుడు బెదిరించడంతో బాధితురాలు మౌనంగా భరిస్తూ వచ్చింది. హోటల్‌ గదిలో ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో తనపై జరుగుతున్న ఘోరాన్ని తల్లిదండ్రులకు కూడా చేరవేయలేకపోయింది. నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేసిన యువతి తాను కటక్ ప్రభుత్వాసుపత్రిలో ఉన్నానని చెప్పింది. ఏం జరిగిందోనన్న ఆందోళనతో వెంటనే అక్కడికి చేరుకున్న వారు కూతురిని చూసి చలించిపోయారు. Also Read: రెండు నెలలుగా నందన్, అతడి స్నేహితుల చేతిలో తాను అనుభవించిన చిత్రహింసలు, లైంగిక దౌర్జన్యం గురించి యువతి తల్లిదండ్రులకు వివరించింది. నాలుగు రోజుల క్రితం మేనత్త హోటల్‌ గదికి వచ్చి తనను కిటికీలో నుంచి బయటకు తోసేసిందని, తీవ్ర గాయాలపాలైన తనను స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు చెప్పింది. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు కటక్ బంకి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రీనా రౌత్రాయ్ తెలిపారు. దీనిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితులను అరెస్ట్ చేయకపోతే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేసేందుకు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె చెబుతున్నారు. Also Read:


By June 03, 2020 at 10:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-gang-raped-in-odisha-over-pretext-of-giving-job/articleshow/76168804.cms

No comments