పెళ్లి పేరుతో బాలికపై రెండేళ్లుగా లైంగిక దాడి... 10 మందిపై కేసు
ప్రేమ పేరుతో మైనర్ బాలికపై రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతూ అబార్షన్ చేయించి మొహం చాటేసిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు కూలి పనులకు వెళ్తుంటారు. దీంతో వారి కూతురు ఇంటి వద్దనే ఒంటరిగా ఉండేది. ఆమెపై కన్నేసిన అదే గ్రామానికి లక్ష్మణ్(30) అనే యువకుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: ఆమె గర్భం దాల్చడంతో పలాసలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్ చేయించి మైనారిటీ తీరగానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈ నెల మొదటి వారంతో ఆమెకు 18ఏళ్లు నిండటంతో పెళ్లి చేసుకోవాలని బాలిక లక్ష్మణ్‌ను కోరగా నిరాకరించాడు. ఇన్నాళ్లూ ఇద్దరం కలిసి ఎంజాయ్ చేశాం.. ఇప్పుడు ఎవరది దారి వారు చూసుకుందామని చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. Also Read: బాలిక తల్లిదండ్రులు నౌపడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. నిందితుడు లక్ష్మణ్‌తో పాటు అతడికి సహకరించిన మరో 10 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By June 28, 2020 at 10:38AM
No comments