Miheeka Bajaj Pics: రానా-మిహికా ఎంగేజ్మెంట్ ఫొటోలు.. అఫీషియల్‌గా ప్రకటిస్తూ పిక్స్ వదిలారు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/75861712/photo-75861712.jpg)
దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం నిన్న (మే 20న) సాయంత్రం 4 గంటలకు జరిగినట్టు వార్తలు వచ్చాయి. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరనుందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. కేవలం ఇరు కుటుంబాలు మాట్లాడుకోవడానికే సమావేశం అవుతున్నట్టు తెలిపిన ఆయన.. నిశ్చితార్థం, పెళ్లి తేదీలను ఖరారు చేసుకుంటామని చెప్పారు. అయితే రానా- మిహీకా బజాజ్ నిశ్చితార్థం జరిగినట్టుగా అఫీషియల్‌గా ప్రకటిస్తూ మిహీకాతో కలిసి ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో విడుదల చేశారు రానా. ప్రస్తుతం వీరికి సంబంధించిన నిశ్చితార్థ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే నిన్న సురేష్ బాబు ఎందుకు నిశ్చితార్థం కాదని చెప్పారు?? ఇప్పుడు రానా ఎందుకు అఫీషియల్ అంటూ ఫొటోలు పెట్టారు. తదితర విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
By May 21, 2020 at 12:08PM
No comments