jr Ntr: ఎన్టీఆర్‌పై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ నటి పూనం కౌర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అనేక రకాల అంశాలపై స్పందిస్తూ కాంట్రోవర్సీకి కేరాఫ్‌గా మారింది ఈ భామ. ఎప్పుడూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు, విమర్శలు చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా పూనం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌పై ట్వీట్ చేసింది. అయితే పుట్టినరోజు సందర్భంగా పూనం కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చిన్నప్పటి నుంచి తిరస్కరణకు గురయ్యాడంటూ ఎన్టీఆర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.ఎదుగుతున్న వయసులో అకారణంగా ప్రేమ నిరాదరణకు గురయ్యాడు.. ఇందులో అతని తప్పు లేదు. చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు.. అతని ప్రయాణాన్ని నేను ఎంతో గౌరవిస్తున్నా. స్వర్గంలో ఉన్న అతని తాత ఆశీర్వాదాలు అతనికి ఎల్లప్పుడూ ఉంటాయి. బెస్ట్ విషెస్' అంటూ ఎన్టీఆర్ ను ఉద్దేశించి పూనం కౌర్ పరోక్షంగా ట్వీట్ చేసింది.ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. కొంతమంది పూనమ్ ను తిడుతుంటే మరోకొంతమంది స్వాగతిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పూనం ట్వీట్ పై స్పందిస్తున్నారు. ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నిజం మాట్లాడే ధైర్యం ఆమెకు ఉందంటూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే కొందరు నెటిజన్స్ మాత్రం.... పూనం ట్వీట్ పరోక్షంగా పెట్టిన అది ఎన్టీఆర్ కోసమే అంటూ అందరికీ అర్థమవుతుందంటన్నారు. మరికొందరు ఎవరి కోసం పెడుతున్నారో మెన్షన్ చేయలేదు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరి పూనం ట్వీట్ పై మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు స్పందించలేదు. మరి రెస్పాండ్ అవుతాడో లేదో వేచి చూడాల్సిందే.
By May 22, 2020 at 10:12AM
No comments