ఎడారిలో శృంగార తారతో రామ్ గోపాల్ వర్మ.. ఇద్దరే ఏకాంతంగా! రచ్చ చేస్తున్న నెటిజన్స్
ఎడారి ప్రాంతం, అంతా నిర్మానుష్యం.. అదే స్పాట్ ఎంచుకున్నాడు సంచలన దర్శకుడు . అక్కడే శృంగార తార మియా మాల్కోవాతో ఏకాంతంగా ముచ్చటిస్తున్నాడు. పైగా ఈ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసి ఆసక్తికర ట్యాగ్ లైన్ జోడించాడు. సాధారణంగానే వర్మ అంటేనే సంచలనం అందునా శృంగార తారతో కలిశాడు కాబట్టి ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది. నెటిజన్ల రచ్చకు కారణమైంది. 'ఎ షాట్ విత్ .. సన్నివేశం కోసమే సామాజిక దూరం పాటిస్తూ చర్చిస్తున్నాం' అంటూ ఆమెతో ఎడారిలో కూర్చొని మాట్లాడుతున్న ఫొటో వదిలాడు రామ్ గోపాల్ వర్మ. ఈ పిక్ చూసిన నెటిజన్స్ ఆసక్తికరంగా స్పందిస్తూ వర్మపై తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ లాక్‌డౌన్‌లో అక్కడ షూట్ ఎలా చేశారు? పర్మిషన్ ఎలా దొరికింది అని కొందరు ప్రశ్నిస్తుండగా.. చాలామంది లైకులు, రీ ట్వీట్స్ చేస్తూ హోరెత్తిస్తున్నారు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో గతంలో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (GST) మూవీ రూపొందించిన వర్మ.. ఈ సారి 'క్లైమాక్స్' రూపంలో మరో సంచలనానికి తెరలేపారు. ఇటీవలే ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేశారు. యాక్షన్ థ్రిల్లింగ్ కథాంశానికి శృంగార సన్నివేశాలు, నగ్న దృశ్యాలు జోడించి ఈ 'క్లైమాక్' రూపొందించిన ఆయన.. ఈ చిత్రాన్ని మే 29వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. #RGVWorldTheatre @shreyaset యాప్‌లో బొమ్మ పడుతుందని తెలిపారు. Also Read:
By May 22, 2020 at 10:16AM
No comments