థ్రిల్లర్ 'A' మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన జగపతిబాబు.. వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్!
కాలం మారింది.. ఇప్పుడు చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. కంటెంట్ ఉండాలే గానీ అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనే తేడా చూపించకుండా ఆదరిస్తున్నారు ఆడియన్స్. మరోవైపు యువ దర్శకులకు, చిన్న సినిమాలకు టాలీవుడ్ సినీ పెద్దల సహకారం కూడా అందుతోంది. ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్ లాంటివి రిలీజ్ చేసి చిన్న సినిమాలను ప్రమోట్ చేయడంలో ముందుంటున్నారు కొందరు స్టార్ హీరోలు. ఈ క్రమంలోనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “A”(AD INFINITUM) మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు . అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యుగంధర్ ముని దర్శకత్వంలో “A” మూవీ రూపొందుతోంది. హీరోగా పరిచయమవుతున్నాడు. తొలి సినిమాలోనే ఆయన 3 విభిన్నమైన పాత్రలు పోషిస్తుండటం విశేషం. ''మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్'' సినిమాలతో పక్కింటి అమ్మాయిగా అలరించిన ప్రీతి అశ్రాని హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రం లోని అన్ని పాటలను అనంత శ్రీరామ్ రాయగా దీపు, పావని ఆలపించారు. విజయ్ కూరాకుల సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్, ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా జగపతిబాబు చేతుల మీదుగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ భారీ హైప్ క్రియేట్ చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో మునుపెన్నడూ చూడని విధంగా ఈ మూవీ థ్రిల్ చేయనుందని తెలుస్తోంది. దీనికంటే మరింత ఆసక్తికరంగా ఉండే టీజర్ త్వరలోనే రిలీజ్ చేస్తామని అంటోంది చిత్రయూనిట్. ఖచ్చితంగా ఈ మూవీ టాలీవుడ్ లోకానికి కొత్త టేస్ట్ చూపిస్తుందని దర్శకనిర్మాతలు అంటున్నారు.
By May 22, 2020 at 09:37AM
No comments