ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు.. ఓ ఎస్సై, నలుగురు మావోలు మృతి
ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మరోసారి కాల్పులు కలకలం రేగింది. మావోయిస్టులు, జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఎస్సైతో పాటు చెందినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజనందగావ్ జిల్లాలోని మదన్వాడ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్యామ్ కిషోర్ శర్మ నేతృత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. పోలీస్ పార్టీ శుక్రవారం రాత్రి మానపూర్ నక్సల్స్ ఆపరేషన్ నిమిత్తం కూంబింగ్ కి వెళ్లింది. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో అప్పటికే అంబూష్ వేసిన మావోయిస్టులు పోలీసులపై ఒక్కసారిగా మెరుపుదాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ పార్టీ మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు నలుగురు మావోయిస్టులతో హతమయ్యారు. మరోవైపు మావోలు జరిపిన కాల్పుల్లో ఎస్సై శ్యామ్ కిషోర్ శర్మ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ జితేంద్ర శుక్ల సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. మాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్దోని గ్రామానికి సమీపంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. నలుగురు మావోల మృతదేహాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారి ద్ద ఉన్న ఏకే 47 రైఫిల్‌తో పాటు, 1 SLR వెపన్, మరో రెండు 315 బోర్ రైఫెల్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
By May 09, 2020 at 08:04AM
No comments