Breaking News

కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: తక్కువ ఖర్చుతో వెంటిలేటర్ రూపొందించిన డీఆర్డీఓ


కరోనాా వైరస్‌కు వ్యాక్సిన్, ఔషధం అభివృద్ధిపై కసరత్తు జరుగుతోందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఛైర్మన్‌ జి.సతీశ్‌ రెడ్డి తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి శానిటైజర్లు, ప్రత్యేక మాస్కులు, వ్యక్తిగత రక్షణ సాధనాలను తయారుచేయనున్నట్లు వెల్లడించారు. సొంత ఫార్ములాలతో గ్వాలియర్‌, ఢిల్లీలోని ల్యాబ్‌ల్లో శానిటైజర్లను ఉత్పత్తి చేస్తున్నామని, ఇప్పటికే 5 లక్షలకుపైగా బాటిల్స్‌ను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ‘డెవెన్‌’ పేరుతో తక్కువ ఖర్చుతో పోర్టబుల్‌ వెంటిలేటర్‌ను హైదరాబాద్ కేంద్రంలో రూపొందించినట్టు తెలిపారు. ప్రాణాంతక కరోనా వైరస్‌కు వ్యాక్సిన్, చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు క్లినికల్ ట్రయల్స్ కూడా ఆరంభించాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం ఏడాది పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ‘హ్యూమన్‌- మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌’ చికిత్సను అభివృద్ధిని వేగవంతం చేసింది. తెలంగాణలో కరోనా కేసులు కొత్తవి క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు కూడా రోజూ పదుల సంఖ్యలో డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో, శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో కరోనా సోకిన ఓ మహిళ ప్రసవించింది. తెలంగాణలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు బాగా తక్కువగా నిర్వహిస్తున్నారంటూ విశ్రాంత ఆచార్యుడు పీఎల్ విశ్వేశ్వరరావు అనే వ్యక్తి గతంలో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యా్జ్యంపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న బాధితుల రేటు పెరుగుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1273 మంది కోలుకున్నారని తెలిపారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు, రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా దెబ్బకు కొద్దిరోజులు కండక్టర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఆన్‌లైన్‌లో, కరెంట్‌ రిజర్వేషన్‌, బస్టాండ్లు, బస్టాపుల్లో సిబ్బంది విక్రయించే టిక్కెట్లను కొని బస్సు ఎక్కాల్సి ఉంటుంది. విశాఖను కరోనా భయం వెంటాడుతోంది. కొద్దిరోజులు వైరస్ ప్రభావం అంతగా కనిపించకపోయిన మళ్లీ మూడు, నాలుగు రోజులుగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం వరకు మొత్తం 46 కేసులు నమోదయ్యాయి. వీరిలో 22మంది డిశ్చార్జ్ కాగా.. 24మంది చికిత్సపొందుతున్నారు.


By May 09, 2020 at 07:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-andhra-and-telangana-across-india-state-wise-live-updates-in-telugu/articleshow/75639171.cms

No comments