Breaking News

ఆంధ్రా వంటలు వండిన కాజల్... బెండకాయ పులుసు, సొరకాయ పచ్చడి


అందాల చందమామ కాజల్ లాక్ డౌన్‌ సమయంలో ఇంట్లోనే కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో షూటింగ్స్ అన్నీ బంద్ అయిన విషయం తెలిసిందే. దీంతో తాను సినిమా షూటింగ్స్‌ను ఎంతగానే మిస్ అవుతున్నానని కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది. అంతేకాదు.. రాత్రి డిన్నర్‌లో తన పేరెంట్స్ కోసం ఆంధ్రా వంటల్ని వండింది కాజల్. ఏంచెక్కా బెండకాయ పులుసు, సొరకాయ పచ్చడి చేసేసింది . వాటితో పాటు పెసరట్టు కూడా రెడీ చేసింది. తొలిసారిగా తాను ఈ వంటలు చేసినా... తన పేరెంట్స్ తనకు ఫుల్ మార్కులు వేశారని ఎగిరి గంతులు వేస్తోంది ఈ చందమామ. తాను చేసిన వంటల ఫోటోల్ని కూడా తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే కాజల్ పోస్టు చేసిన ఫోటోల్లో బెండకాయ మాత్రమే కనిపించడంతో... పులుసు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. కొందరు చిలిపిగా పులుసు కాజల్ తాగేసిందేమోనని కామెంట్లు కూడా పెడుతున్నారు. మొత్తం మీద లాక్ డౌన్‌లో వంటలు బాగానే నేర్చుకుంటున్నావు అంటూ మరికొందరు ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ఇంకొందరు ఔత్సాహికులు.. రకరకాల ఆంధ్రా డిష్‌ల పేర్లు చెబుతూ.. ఇవి చేస్తే బావుంటుందని సలహాలు కూడా ఇస్తున్నారు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కాజల్. ఈ చందమామ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికే పదముడేళ్లవుతోంది. దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించేసింది. మెగాస్టార్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, రామ్ ఇలా దాదాపు అందరి హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. ఓ వైపు టాలీవుడ్‌లో బిజీగా ఉంటూనే.. అటు బాలీవుడ్, తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం కాజల్ 'భారతీయుడు 2' సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుంది.ఉదయనిధి స్టాలిన్ మూవీలో నటిస్తుంది.. ఇందుకు గాను భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. రమేష్ అరవింద్ దర్శకత్వం లో పారిస్ పారిస్ చిత్రాల్లో నటిస్తుంది.


By May 09, 2020 at 07:40AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kajal-aggarwal-make-a-full-on-andhra-meal-bendakaya-pulusu-sorakai-pachdi/articleshow/75639263.cms

No comments